Top 10 Telugu movies of 2017

Top 10 Telugu movies of 2017

2017 వ సంవత్సరం సినిమా అభిమానులకు ఎన్నో కొత్త సినిమాలను chusey అవకాశం కల్పించింది.కొత్త కొత్త డైరెక్టర్స్ ని ప్రేక్షకులకు టాలీవడ్ కి పరిచయం చేసింది. కొత్త కొత్త కథలను సరికొత్త స్క్రీన్ ప్లే జోడించి ఎన్నో హిట్స్ ని టాలీవడ్ కి అందించారు.అలాగేయ్ 2017 వ సంవత్సరం ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. మూవీ పెద్దలను 2017 లో టాలీవుడ్ కోల్పోయింది
2017 సంవత్సరం లో తెలుగు లో రిలీజ్ ఐన టాప్ మూవీస్ ఇవే :

1  BAHUBALI 2  :

ఈ మూవీ ని రాజమోళి డైరక్ట్ చేయగా రెబల్ స్టార్ ప్రబస్ ప్రధాన పాత్రదారిగా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు .ఈ మూవీ లో అనుష్కాతనదైన శైలి లో ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ఇక విలన్ గ చేసిన రానా చక్కటి నటనతో తన ఫ్యాన్ బేస్ ని పెంచుకున్నాడు.ఈ మూవీ కి MM కీరవాణి సంగీతం అందించగా రచన సహకారాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర అందించారు .

బాబుబలి 2 కలెక్షన్స్:1,294 crore in all languages

2 ARJUN REDDY :

Sandeep Reddy Vanga దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంశలు అందుకుంది.అరేయ్ భాయ్ ఎం మూవీ తిసిండ్రా దీనమ్మ జీవితం అనుకునేలా ఉంది మూవీ. అప్పట్లో శివ ఇప్పుడు అర్జున్ రెడ్డి అంతే, మనకు తాగకుండానే కిక్ ఐక్కించిన మూవీ. .హీరో గ నటించిన విజయ్ దేవేరుకోండ
యూత్ ఐకాన్ అయిపోయాడు ఒక్కసారిగా. మూవీ చుసిన వారు ఎవరు హీరో ఆటిట్యూడ్ ని మర్చి పోలేరు.చాల నతురల్ గ నటించారు అని చెప్పుకోవచ్చు.మూవీ “A ” రేటెడ్ ఐన ప్రతిఒక్కరికి ఈ మూవీ నచుతుంది.హీరోయిన్ గ నటించిన Shalini పండేయ్ తన నటనతో అందరి హృదయాలను
కొల్లగొట్టింది. ఇక శివ character లో నటించిన రాహుల్ “ఫ్రెండ్ అంటేయ్ వీడు రా” అనే ల తన character తో అందరిని మెప్పించాడు. విజయ్ దేవరకొండ ఒక మోడరన్ దేవదాస్ ల కనిపించదు ఈ మూవీ లో. క్లైమాక్స్ సీన్స్ ఈ మూవీ కి హైలైట్.యూత్ బాగా కనెక్ట్ అయినారు క్లైమాక్స్ సీన్ కి. ముఖ్యం గ BGM ఈ మూవీ కి హైలైట్ అని చెప్పాలి.అర్జున్ రెడ్డి తన రాయల్ ఎంఫిల్డ్ పై వచ్చేటప్పుడు కొట్టిన BGM ని ఎవరు మర్చిపోలేరు.

 

3 Fidaa:

ఒక తెలంగాణ అమ్మాయి ఒక NRI మధ్యన సాగే ప్రేమకథ.చిన్నపాటి మనస్పర్థలు ,కోపం ,ప్రేమ అన్ని కలిసిన ఒక విందు భోజనం ఈ మూవీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్ అందుకుంది.ఈ మూవీ లో నటించిన సాయి పల్లవి కాదు కాదు భానుమతి ని మనం మర్చిపోలేం.మన మైండ్ లో నుంచి పోదుర భయ్ ఎం చేసింది రా పిల్ల .ఆ యాస ఏందీ తన నటన ఏందీ భలేయ్ ఉంది ర భానుమతి .ఫిదా అనగానే ముందుగా వరుణ్ కన్నా అందరికి భానుమతి గుర్తుకువస్తుంది.తన యాక్టింగ్ స్కిల్స్ మరియు dancing తో ముఖ్యంగ తెలంగాణ యాస తో, చిన్న చితక ముసలి ముతక పిల్ల పెద్ద అందరిని ఆకట్టుకుంది.భానుమతి కోసం 2 వసారి చూసినవాళ్లు అనేకం.వరుణ్ ఈ మూవీ లో చాల బాగా నటించాడు.సంగీతం విహాయని కి వస్తే Shakti కాంత్ చక్కటి బాణీ లను అందించాడు.

4 The Ghazi Attack :

సంకల్ప్ రెడ్డి చాలా ధైర్యంగా తన మొదటి సినిమా ని తెరకేక్కిన్చాడు. తాను తన మూవీ ని పక్క స్క్రీన్ ప్లే తో ఒక కొత్త కథ తో ప్రేక్షకుల ముందుంచి ,హిట్ ని అందుకున్నాడు.its a underwater film .బాహుబలి తరువాత రానా దగ్గుపాటి నటించిన ఈ చిత్రం సంచలనం విజయం సాధించింది.రానా ఈ చిత్రం లో ఒక సిన్సియర్ కెప్టెన్ గా నటించాడు.KK మీనన్ తన యాక్టింగ్ తో తెలుగు హృదయాలకు దగ్గరయ్యాడు.Atul కులకర్ణి,సత్యదేవ్,Rahul Singh Om Puri and Nasser వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేకూర్చారు.తాప్సి ని ఈ మూవీ లో ఎందుకు తీసుకున్నారో తెలియదు చాలా చిన్న క్యారెక్టర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చిత్రాన్ని కి సినిమాటోగ్రఫీ గుండె లాంటిది. సెకండ్ హాఫ్ ఉత్కంఠ రేకెత్తించింది .కథ లో దమ్ముంది చిత్రం ఆడింది.

4 ‘ఖైదీ నెం.150:

ఖైదీ నెం.150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన స్టామినా ఏంటో బాక్స్ఆఫీస్ కు రుచిచూపాడు. తన అభిమానులను మరొక్కసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన చిరంజీవి 150 వ చిత్రం విడుదలై ఘ్నవిజయం అందుకుంది.ఈ చిత్రం లో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసాడు.కాజల్ గ్లామర్ రోల్ కె సరిపోయింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఇంకో బ్లాక్బస్టర్ ని తనఖాతా లో వేసుకున్నాడు..

5 గౌతమిపుత్ర శాతకర్ణి :

ఈ చిత్రం బాలయ్య 100 వ చిత్రం గా రిలీజ్ ఐ అద్భుతమైన ఘ్న విజయం సాధించింది. బాలయ్య మరియూ క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ హిట్ గా నిలిచింది.బాలకృష్ణ ఈ మూవీ లో తన నటన తో మరొక్కసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు.బాలయ్య మూవీ అంటేయ్ పెద్దగా పట్టించుకోవటం మర్చిపోయిన జనాలను థియేటర్లు కి రప్పించాడు. బాలయ్య చెప్పేయ్ ఒక్కొక్క డైలాగు రీక్యాప్ చేసి చూడాలనిపించేట్టుగా తీసాడు క్రిష్ .ఈ మూవీ తో బాలకృష్ణ పెద్ద హిట్ ని అందుకున్నాడు. ఇదొక చారిత్రాత్మక చిత్రమనే భావన కలగనీయకుండా ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేశారు. చిరంతన్‌ భట్‌ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరాయి. సాయిమాధవ్‌ బుర్రా అద్భుతమైన సంభాషణలు రాశారు.

6 Ninnu Kori :

వరుసగా ఆరు విజయాలందుకుని తిరుగులేని ఫాంలో కొనసాగుతున్నాడు నాని. ఈ రోజుల్లో ప్రేమ.. పెళ్లి విషయంలో యువత ఆలోచనలు కూడా మారిపోతున్న నేపథ్యంలో సినిమాల్లో లవ్ ఫీల్ తీసుకురావడం.. దాని చుట్టూ ఎమోషన్లు పండించడం చాలా కష్టమైన వ్యవహారం అయిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ భగ్న ప్రేమికుడి కథను భావోద్వేగాలతో చెప్పాలనుకోవడం సాహసమే. కొత్త దర్శకుడు శివ నిర్వాణ ఆ సాహసమే చేశాడు. గోపీసుందర్ మంచి ఫీల్ ఉన్న సంగీతంతో సినిమాకు బలంగా నిలిచాడు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. అడిగా అడిగా.. ఉన్నట్టుండి గుండె.. టైటిల్ సాంగ్.. వెంటాడతాయి. నేపథ్య సంగీతం కూడా చక్కగా కుదిరింది. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం సినిమాలో మరో హైలైట్.

7 హలో :

అఖిల్ ని రెలాఉంచి చేస్తూ తీసిన ఈ చిత్రం ఘానా విజయం సాధించింది. నాగార్జున తానే స్వయంగా రంగంలో దిగి అఖిల్ ని ప్రమోట్ చేసాడు.విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ‘హలో’ ఆడియోతో అనూప్ రూబెన్స్ మ్యాజిక్ చేసేశాడు. రమ్యకృష్ణ.. జగపతిబాబు పాత్రలకు తగ్గట్లుగా నటించారు.

8 ‘గరుడవేగ’ :

పెర్పామెన్స్ పరంగా రాజశేఖర్ అదరగొట్టాడు. సీరియస్ పోలీస్ క్యారెక్టర్లో తనదైన శైలిలో నటించి మెప్పించాడు రాజశేఖర్. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది.ప్రవీణ్ సత్త్రు దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం రాజశేఖర్ కు హిట్ ని అందించింది .ఈ మూవీ రాజశేఖర్ కేరీర్ కు జీవం పోసింది రాజశేఖర్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకుంటాడు తన నటనలో పస తగ్గలేదు అని నిరూపించుకున్నాడు.

9 MENTAL MADILO:

‘పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించాడు.అశ్లీలం, ద్వందార్థాలకు ఎక్కడా తావులేకుండా చక్కటి కుటుంబ కథా చిత్రంగా రూపొందుకున్నది మెంటల్ మదిలో.Mental మదిలో చిత్రం చాలా సింపుల్ అండ్ క్యూట్ స్టోరీ లైన్.అరవింద్ కృష్ణగా శ్రీవిష్ణు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో స్వేచ్చ పాత్ర లో నటించిన నివేదా పేరురాజ్ 100 పర్సెంట్ న్యాయం చేసింది. ఈ సినిమా పెద్ద ప్లస్ పాయింట్ ప్రశాంత్ అందించిన సంగీతం. నేపధ్య సంగీతం ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదనిపిస్తుంది.

10 శతమానం భవతి :

దిల్ రాజు నిర్మాణంలో వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించిన చిత్రం హిట్ గ నిలిచింది .సంపాదనలో పడి.. విదేశాల్లో స్థిరపడిపోయి మూలాల్ని మరిచిపోయిన నేటి తరానికి కుటుంబ విలువల ప్రాముఖ్యతను తెలియజెప్పే ప్రయత్నమే ‘శతమానం భవతి’..శర్వా-అనుపమలను వింటేజ్ లుక్ లో చూపించే పాటను చాలా బాగా తీశాడు.శర్వా ఈ చిత్రం తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Facebook Comments

Related Post

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *